'తక్కువ ఖర్చు చేశాను.. అయినా నేనే టాప్'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తాను చాలా తక్కువ ఖర్చు పెట్టినప్పటికీ ప్రజాదరణలో తొలి స్థానంలో ఉన్నట్లు రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వచ్చే వారం నుంచి ఏడు రోజులకు గాను 2మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో 13.27 కోట్ల రూపాయలు) ప్రకటనలకు ఖర్చుపెట్టనున్నట్లు వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నాకు 40 శాతం ప్రజాదరణ ఉండగా, తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థికి కేవలం 13 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో తాను ఖర్చు పెట్టేందుకు సిద్ధమన్నారు. సరిహద్దు భద్రతా, వ్యాపారం, ఐఎస్ఎస్ నుంచి రక్షణ లాంటి అంశాలకు గానూ తాను ఈ డబ్బును ఖర్చుచేయనున్నట్లు చెప్పారు.
తన ట్విట్టర్ ఖాతాలో మరిన్ని విషయాలను ట్రంప్ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం జెబ్ బుష్ ఇప్పటికే 391 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఎవ్వరూ ఆయనను ఆదరించలేదని, కానీ తాను మాత్రం అధ్యక్ష ఎన్నికల కోసం చేసింది ఏమాత్రం కాదని పేర్కొన్నారు. వచ్చే సోమవారం నుంచి ప్రకటనలు, ఇతరత్రా ప్రచార కార్యక్రమాల కోసం వారానికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల పూర్తి స్థాయి ప్రచారానికి మొత్తంగా 232కోట్ల రూపాయలు వ్యయాన్ని వినియోగిస్తామని అధ్యక్ష బరిలో ముందున్న డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
My campaign for president is $35,000,000 under budget, I have spent very little (and am in 1st place).Now I will spend big in Iowa/N.H./S.C.
— Donald J. Trump (@realDonaldTrump) December 29, 2015
So, I have spent almost nothing on my run for president and am in 1st place. Jeb Bush has spent $59 million & done. Run country my way!
— Donald J. Trump (@realDonaldTrump) December 29, 2015