పరుగులు తీసిన పోలీసులు
వేలూరు: వేలూరు రంగాపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కోశాధికారి ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు పరుగులు తీసి, ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్‌వచ్చారి పోలీస్ స్టేషన్‌కు సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కార్యదర్శి సీకే దేవేంద్రన్ ఇంటిలో బాంబు పెట్టామని గంట సమయంలో అది పేలుతుందని తెలిపి ఫోన్ కట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసు లు రంగాపురంలోని దేవేంద్రన్ ఇంటికి వద్ద డాగ్ స్క్వాడ్‌తో వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిలో ఎం త గాలించినప్పటికీ ఎటువంటి బాంబు ఆచూకీ తెలియక పోవడంతో పోలీసు లు వెనుతిరిగి వెళ్లారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ నెంబరు నుం చి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చే స్తున్నారు. ఇదిలా ఉండగా రంగాపురం ప్రాంతంలోని దేవేంద్రన్ ఇంటి వద్ద ఆకస్మికంగా బాంబు తనిఖీ లు చేపట్టడంతో చుట్టు పక్కల ఉన్న కుటుంబీ కులు పూర్తిగా బయటకు వచ్చారు.
కాంగ్రెస్ నేత ఇంటికి బాంబు బెదిరింపు
Published Tue, Feb 2 2016 3:36 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement