పోలీసులపై దాడి చేస్తున్న లోకేష్
లంగర్‌హౌస్: పోలీస్‌స్టేషన్‌తో పాటు ఒక్కో పోలీసు కింద బాంబు పెట్టి పేల్చి లేపేస్తా... ఎవడురా నన్ను అడ్డుకునేది.... ఎస్పీ, డీఎప్పీ ఎవడు వస్తాడో రమ్మను ఇక్కడే ఉంటా అందరిని చంపేస్తా.. అంటూ ఓ వ్యక్తి పోలీసులకు నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... హిమయత్‌సాగర్ గ్రామంలో నివాసముండే లోకేష్(40) గతంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు గురువారం ఉదయం తన ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఇటు ఎందుకు వెళుతున్నావని పోలీసులు అడగగా తన ఇష్టం తనకు పనులు ఉన్నాయన్నాడు. అయితే ఈ భయంకర వాతావరణంలో హెల్మెట్ లేదు కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేవు అని పోలీసులు అడిగారు. దీంతో రెచ్చిపోయిన లోకేష్ లాక్‌డౌన్ అంటూ అందరిని పోలీసులు వేదిస్తున్నారు ఏందిరా మిమ్మల్ని బాంబులతో చంపుతా అంటు రెచ్చిపోయాడు. మీరు కూడా ఎందుకు పెట్టుకున్నారురా మాస్కులు అంటు పోలీసుల నుంచి మాస్కులు లాగి వారిపై దాడి చేశాడు. వార్నింగ్‌లు ఇస్తూ.. దుర్భాషలాడుతూ.. ఆ ప్రాంతంలో హల్‌చల్ సృష్టించాడు. అలా అన్నొద్దని అతడిని సముదాయించిన వారిని సైతం తిడుతూ దాడికి దిగాడు.(సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు)
పోలీసుల తీరుపై విమర్శలు, ప్రశంసలు....
కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటకి వచ్చిన వారిపై సైతం పోలీసులు లాఠీలు జులిపించారు. కాని నడి రోడ్డుపై లోకేష్ హంగామా చేస్తుంటే పోలీసులు ఏమనకుండా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వారి సహనానికి సలాం అంటూ ప్రశంసించారు. లోకేష్ భార్య కొద్ది నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి మానసిక పరిస్థితి బాగలేదని గతంలో ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి నెలలో డిశ్చార్జ్ అయ్యాడని తెలుసుకుని పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మానసిక రోగిని ఆస్పత్రికి పంపకుండా ఇంటికి పంపడంలో ఆంతర్యమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.(సొంతూరికి దారేది?)
Comments
Please login to add a commentAdd a comment