పారిస్: పారిస్లో మరోసారి బాంబుల కలకలం రేగింది. మూడు పాఠశాలలు ఉన్నపలంగా ఖాళీ చేశారు. దీని వివరాలను పోలీసులు తెలియజేస్తూ సోమవారం మూడు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు తమకు సమాచారం అందడంతో అదే విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.
అయితే అందులో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని తెలిపారు. గత వారం కూడా రెండు ఫేక్ బాంబు అలర్ట్స్ రావడంతో పలు పాఠశాలలు ఉన్న పలంగా ఖాళీ చేశారు. ఫ్రెంచ్ ఉపాధ్యాయులను హత్య చేస్తామని, ఆ దేశ విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తామని, అల్లాకు వ్యతిరేకంగా ఎవరుంటే వారిని చంపేస్తామని లో దార్ అల్ ఇస్లామ్ అనే ఆన్ లైన్ ఫ్రెంచ్ భాష మేగజిన్ 2015 నవంబర్ ఎడిషన్లో ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది. అప్పటి నుంచి ఫ్రాన్స్ స్కూల్లలో ఏ అలికిడి వినిపించినా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు.
పారిస్లో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపు
Published Mon, Feb 1 2016 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement