
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని కాల్ చేశాడు. ఆగి ఉన్న రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.