రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొని పోలీసులకు చిక్కిన ఆర్మీ ఉద్యోగార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి వారిని గోపాలపురం, జీఆర్పీ, టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్లలో ఉంచి విచారణ జరుపుతున్నారు. శనివారం రాత్రి వరకు పోలీసులు వారి అరెస్టు చూపించలేదు.
టీవీల్లో వార్తలు చూసిన ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు శనివా రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి తమ పిల్లల గురించి ఆరాతీస్తూ కనిపించారు. పోలీసులు అరెస్టు చేశారా, ఎక్కడికైనా వెళ్లిపోయా రా.. వారికి ఏం జరిగిందోనని ఆందోళనకు లోనయ్యారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమ పిల్లల గురించి ఆరా తీశారు. కానీ పోలీసులు ఏ విషయం చెప్పకపోవడంతో పిల్లల జాడ ఎక్కడ అంటూ విలపించారు.
పోలీసులు ఏమీ చెప్పడం లేదు
నిన్న టీవీలో సికింద్రాబాద్ ఘటన చూసి చాలా ఆందో ళన చెందాం. మా అక్క కు మారుడు మహేందర్‌కు చా లా సార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. దీంతో రాత్రి హైదరాబాద్ వచ్చి గోపాలపురం, సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్‌లలో అడిగాం. కానీ ఎవరూ సమాధానం చెప్పడంలేదు.
– సాయప్ప, తాండూరు రాంపూర్ గ్రామం
Comments
Please login to add a commentAdd a comment