Tamil Nadu: Dad Denies Money, Youth Throws Bomb At Own House In Chennai - Sakshi
Sakshi News home page

తండ్రి నో చెప్పాడని.. సొంత ఇంటిపై బాంబు వేసి.. అక్కడి నుంచి

Published Wed, Jul 19 2023 4:50 PM | Last Updated on Wed, Jul 19 2023 8:38 PM

Chennai: Man Throws Bomb At His Own House Tamil Nadu - Sakshi

చెన్నై: పిల్లలు తల్లిదండ్రులను డబ్బులు అడగడం.. అందుకు వాళ్లు ససేమిరా అనడం సహజమే. ఇక కోపంతో కొందరు పిల్లలు కన్నవాళ్లతో గొడవపడడం లాంటి చేస్తుంటారు. కానీ ఓ పుత్ర రత్నం మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు దాడి చేశాడు. ఈ కేసులో ఇంటి యజమాని కుమారుడితో సహా ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వేలచ్చేరిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వేలచ్చేరిలోని భారతీయార్‌ వీధిలో నివాసం ఉంటున్న పన్నీర్‌సెల్వం ఇటీవల తనకున్న కొద్దిపాటి భూమిని విక్రయించాడు. డబ్బులు చేతికి రాగానే ఆ మొత్తంలో రూ.3 లక్షలు ఇవ్వాలని కుమారుడు అరుణ్‌ తండ్రిని అడిగాడు.

అందుకు పన్నీర్‌ సెల్వం నిరాకరించాడు. దీంతో కోపంతో అరుణ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన బావమరిది ప్రవీణ్‌తో కలిసి బైక్‌పై వచ్చి తన సొంత ఇంటిపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ పేలుడులో అరుణ్‌ చిన్నాన్న వెట్రివేందన్‌, సోదరి రేఖకు స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబు నిపుణులను రప్పించి విచారణ చేపట్టారు. ఇంటిలో నాటు బాంబు పేలుడు పదార్థాలు దాచి ఉంచగా వాటిని జప్తు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్‌, ప్రవీణ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
చదవండి   రోజూ ఒకే టైంలో పవర్‌ కట్‌.. అసలు సంగతి తెలిసి గ్రామస్తుల మైండ్‌ బ్లాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement