బెంగళూరులో 2014 డిసెంబర్ 28న చర్చిస్ట్రీట్‌లో బాంబు పేలుడులో ప్రణాళిక ప్రకారం రెస్టారెంట్ లోపల బాంబు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో 2014 డిసెంబర్ 28న చర్చిస్ట్రీట్‌లో బాంబు పేలుడులో ప్రణాళిక ప్రకారం రెస్టారెంట్ లోపల బాంబు పేల్చాలనుకున్నానని శుక్రవారం అరెస్టయిన సిమీ ఉగ్రవాది రఫీక్‌ఖాన్(30) వెల్లడించాడు. ఇతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టుచేసి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచింది. ఆనాడు కోకొనట్ గ్రోవ్‌బార్ అండ్ రెస్టారెంట్‌కు ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం విందుకు హాజరవనుందనే సమాచారం తెలిసి ఎక్కువ ప్రాణనష్టం కలిగేలా హోటల్ లోపల బాంబు అమర్చాలనుకున్నానని, గేటు వద్ద సెక్యూరిటీ తనిఖీలు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని రఫీక్ వెల్లడించాడు.