Adipurush Writer Manoj Muntashir Special Security - Sakshi
Sakshi News home page

Adipurush Writer: బెదిరింపులు.. రైటర్‌కు స్పెషల్ సెక్యూరిటీ!

Published Mon, Jun 19 2023 5:55 PM | Last Updated on Mon, Jul 31 2023 8:27 PM

Adipurush Writer Manoj Muntashir Special Security - Sakshi

'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. రైటర్ మనోజ్ ముంతాషిర్ గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన‍్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం సినీ వర్గాలు, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

మాట మార్చడమే కారణమా?

'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఒరిజినల్ స్టోరీతో పోల‍్చి చూస్తే.. ఇందులో కొన్ని సీన్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. ఈ విషయమై తాజాగా స్పందించిన రైటర్ మనోజ్.. తాము తీసింది రామాయణం కాదని, కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: రావణుడు లుక్‌పై క‍్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!)

ఫ్యాన్స్ కి మండింది!

అయితే 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఒకలా మాట్లాడిన రైటర్ మనోజ్.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మాట మార్చడం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు పర్వాలేదు గానీ ఓ వ్యక్తి మాత్రం చంపేస్తా అంటూ సదరు రైటర్ ఇంటికి లెటర్ పంపించాడు. దీంతో ఇతడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఇతడికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ లేఖ ఎవరు పంపించారనేది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పుకొచ‍్చారు.

హద్దులు దాటుతున్న అభిమానం

ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం వరకు ఓకే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం ఏదైనా సినిమాలో చిన్న సీన్ నచ్చకపోయినా సరే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'ఆదిపురుష్' రైటర్ విషయంలోనూ జరిగిందిదే అనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా వల్ల విపరీత పోకడలు కనిపిస్తుండటం భయం కలిగిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement