పంజాబ్‌కు చెందిన నలుగురు నేతలకు ‘బీజేపీని వీడండి...లేదంటే ప్రపంచం నుంచి లేపేస్తాం’ అంటూ బెదిరింపు లేఖలు అందాయి. ఇవి ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
చండీగఢ్‌లోని పంజాబ్ బీజేపీ కార్యాలయానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఒక బెదిరింపు లేఖ వచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా, బీజేపీ సిక్కు సమన్వయ కమిటీ, జాతీయ రైల్వే కమిటీ సభ్యుడు తేజిందర్ సింగ్ సరణ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పర్మీందర్ బ్రార్‌లను చంపుతామని ఆ లేఖలో నిందితులు హెచ్చరించారు. వీరితోపాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పేరు కూడా లేఖలో ఉంది.
ఈ లేఖపై తక్షణం విచారణ జరిపించాలని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను కోరారు. ఆ లేఖలో నిందితులు ప్రధానంగా బీజేపీ నేతలు పర్మీందర్ సింగ్ బ్రార్, తేజిందర్ శరణ్‌లను టార్గెట్ చేశారు. మీ తలలను తలపాగాలో చుట్టేశారని గతంలో తాము సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా మిమ్మల్ని హెచ్చరించామని నిందితులు ఆ లేఖలో పేర్కొన్నారు. మీరు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో కలిసి సిక్కులకు, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని నిందితులు ఆరోపించారు. మీరు తక్షణం బీజేపీని వీడండి. లేదంటే మేము మిమ్మల్ని ఈ లోకం నుండి దూరం చేస్తామని నిందితులు ఆ లేఖలో హెచ్చరించారు. లేఖను రాసిన గుర్తు తెలియని నిందితులు దానిలో ఖలిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment