ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది
వారం రోజుల క్రితం సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు.
దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment