గర్భిణికి సిజేరియన్ చేసి పురుడు పోసిన జెమ్స్ కోవిడ్ ఆసుపత్రి సిబ్బంది
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని కోవిడ్ (జెమ్స్) ఆసుపత్రిలో కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్ చేసి పురుడు పోశారు. పసికందుకు నెగిటివ్ రావడంతో తల్లితోపాటు వైద్య సిబ్బంది అంతా ఆనందం వ్యక్తం చేశారు. రేగిడి ఆమదాలవలస కందిత గ్రామానికి చెందిన మహిళ ఇటీవల హైదరాబాద్ నుంచి తన స్వస్థలానికి చేరుకుంది. అప్పటికే ఆమె నిండు గర్భిణి. ఆమె రాగానే వలంటీర్లు మెడికల్ అధికారికి ఫిర్యాదు చేయగా ప్రథమ దశలో హోం క్వారంటైన్‌లో కొన్ని రోజులు ఉంచారు.
స్వాబ్ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా ఈనెల 7న నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో గైనికాలజిస్ట్ డాక్టర్ శిరీష ఆమెకు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ఆమె పండంటి ఆడబిడ్డను కన్నది. పుట్టిన బిడ్డకు కరోనా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పాజిటివ్ బాధితురాలికి దగ్గరుండి వైద్య సేవలందించి, ఎలాంటి సంకోచం లేకుండా ఆమెకు ఆపరేషన్ చేసినందుకు డాక్టర్ శిరీష, ఎనస్తీíÙయా వైద్యులు హర్ష, చిన్నపిల్లల డాక్టర్ రామ్‌తోపాటు నర్సులు, టెక్నీషియన్లను అందరూ అభినందించారు. చదవండి: ఎంత పనిచేశావమ్మా..!
Comments
Please login to add a commentAdd a comment