నిరసన వ్యక్తం చేస్తున్న దంపతులు
రువళ్లూరు: ప్రసవనొప్పులు రావడంతో చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభు త్వ వైద్యశాలకు వచ్చిన గర్భిణిపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యం కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో దంపతులు అర్ధరాత్రి వేళ ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా మహ్మద్ అలీ వీధికి చెందిన మణిగండన్(35). ఇతని భార్య భారతి(32).
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారతి మూడోసారి గర్భం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో బఽంధువులు ప్రసవం కోసం తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే వైద్యశాలకు వచ్చి రెండు గంటలు దాటినా కనీసం నర్సులు కూడా పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు.
ఆమెకు ప్రసవనొప్పులు అధికం కావడంతో పాటు చలి జ్వరం రావడంతో విషయాన్ని ఆమెక భర్త వైద్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మణిగండన్ భార్యతో కలిసి అక్కడే నిరసనకు దిగాడు. వైద్యులు, నర్సులకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ప్రభుత్వ వైద్యశాల నుంచి బయటకు వెళ్లి సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment