గర్భిణీ స్త్రీలు స్వయంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, పిండం పెరుగుదల, అభివృద్ధికి మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ ఆహారాలతో పాటు తొందరగా శక్తిని, పోషకాలను అందించే జ్యూస్‌లను సేవించాలి. దీంతోపాటు గర్భిణీ స్త్రీలు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే..చక్కెర వాడకాన్ని తగ్గించాలి. కృత్రిమ స్వీట్నర్లు ,ప్రిజర్వేటివ్‌లు లేని సహజ పండ్ల రసాలను మాత్రమే తాగాలి. ప్రెగ్నెంట్ లేడీస్ మెచ్చే జ్యూస్‌లు కొన్ని చూద్దాం..
బనానా జ్యూస్
అరటిపండులో శరీరానికి కావల్సిన పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B6 కూడా ఉంటుంది, అరటి పండులో కొద్దిగా తాగా మీగడ వేసుకుని జ్యూస్, కొద్దిగా తేనె లేదా బెల్లం పొడి కలుపుకుని తాగి కడుపు నిండినట్టూ ఉంటుంది. ప్రారంభ నెలల్లో ఈ జ్యూస్ శక్తిని, బలాన్నిస్తుంది. వాంతులు, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్లు ,మినరల్స్ అధికంగా ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కూడా నారింజలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పిండంలోని లోపాలను నివారించడానికి , మెదడు , వెన్నెముకలో అసాధారణతలను నివారించడానికి సహాయపడుతుంది.
క్యారెట్ జ్యూస్
1వ, 2వ , 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలకు క్యారెట్ రసం ఉత్తమమైన రసం. క్యారెట్‌లో విటమిన్ ఎ, ఐరన్, బి విటమిన్లు, పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ కంటెంట్ కడుపులోని పిండం ఎముకలు ,దంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు క్యారెట్ రసాన్ని తగినంత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు 1 గ్లాసు చాలా ఎక్కువ విటమిన్ ఎ ఆరోగ్యానికి తగినది కాదు ఎందుకంటే ఇది విషపూరిత ప్రభావాలను కలిగిస్తుంది.
ఆపిల్ జ్యూస్
ఆపిల్‌లో ఫైబర్‌తోపాటు విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించే ఫ్లేవనాయిడ్సీ , ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది , రక్తహీనతను నివారిస్తుంది.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అవోకాడో జ్యూస్
అవకాడోస్‌లోని ఐరన్, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవకాడోలోని కోలిన్ శిశువు మెదడు, నరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అవకాడోలో అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
మిక్స్‌డ్ జ్యూస్
సన్నగా తరిగిన అరకప్పు లేత పాలకూర, నాలుగు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు ఆవకాడో, అరకప్పు నీళ్లు తీసుకుని జ్యూసర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌ను వడగట్టకుండా అలాగే తాగాలి. గర్భిణులకు ఈ స్మూతీ అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.
గర్భిణీ స్త్రీకి అధిక పోషకాహారం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, పానీయాలను కూడా తీసుకోవాలి. అందులోనూ వేసవి కదా మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్యూస్‌లు అందరికీ ఒకేలా పనిచేయవు. ఏదైనా ఎలర్జీలాంటివి ఉంటే ఈ జ్యుసెస్‌ను సేవించటేపుడు అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం,చిన్నపాటి వ్యాయామం, ఎవరి టేస్ట్‌కు తగినట్టు, ఆయా జ్యూస్‌లను తాగుతూ, ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రసూతి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటే పండంటి బిడ్డ మీసొంతం.
Comments
Please login to add a commentAdd a comment