
కోహినూరు కాంతులు గోల్కొండవే..
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కిరీటంలోని కోహినూర్ ధగధగలు గోల్కొండ రాజ్యానివే... అప్పటి కుతుబ్‌షాహీ రాజ్యంలోని కొల్లూరు(గుంటూరు జిల్లా) వజ్రపు గనులకు ప్రసిద్ధి... కెంపులు, రత్నాలు, గోమేధికాలతో పాటు విలువైన రాళ్లు దొరికేవి. వజ్రాలు దొరికితే... గోల్కొండ కోటకు రావాల్సిందే. 793 క్యారెట్ల కోహినూర్ వజ్రం గోల్కొండ రాజుల నుంచి మొగల్ చకవర్తి షాజహాన్ వద్దకు చేరింది. పర్షియా, అఫ్గానిస్తాన్, లాహోరుల మీదుగా 1849లో మహారాజ దులీప్‌సింగ్ చేతికి చిక్కింది. ఆయన దాన్ని బ్రిటన్ రాకుమారికి అందచేశాడు.
అప్పట్లో గోల్కొండ వీధుల్లో విలువైన రాళ్లు, రత్నాలతో పాటు ముత్యాల్ని వీధుల్లో రాసులు పోసి అమ్మేవారు. గోల్కొండ సమీపంలోని కార్వాన్‌లో వజ్రాలకు సానబట్టే పరిశ్రమే ఉండేది... కోహినూర్ భారతదేశ సంపదని దాన్ని ఇచ్చేయాలంటూ 2008లో బ్రిటీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
1849లో మహారాజ దులీప్‌సింగ్ కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ రాకుమారికి అందచేశాడు.