
ప్రచార యావ తప్ప.... ఆలోచన లేదు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రచార యావ తప్ప ..ఆలోచన లేదని సాక్షి టీవీ హెడ్ లైన్ షోలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం దుయ్యబట్టారు. కొత్త రాష్ట్రం ...కొత్త ప్రభుత్వ ...ప్రత్యేకతను చాటుకోవడానికి ఆరాటపడినట్లుగా కేసీఆర్ ప్రసంగం సాగిందన్నారు. కేసీఆర్ భారత ప్రధానమంత్రిని నియంతగా అభివర్ణించడం సరికాదన్నారు. కేసీఆర్ ఆలోచన సరళి మార్చుకోవాలని కోరారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా దళితలను చేస్తానని ప్రచారం చేసిన కేసీఆర్...పంద్రాగస్టు వేడుకల్లో గోల్కొండ పై దళితుడితో జెండా ఎగరేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.