కేసీఆర్‌ది అవగాహన లేని పాలన: పొన్నాల | kcr have lack of understanding of the rule: Ponnala | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది అవగాహన లేని పాలన: పొన్నాల

Published Sat, Oct 18 2014 12:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కేసీఆర్‌ది అవగాహన లేని పాలన: పొన్నాల - Sakshi

కేసీఆర్‌ది అవగాహన లేని పాలన: పొన్నాల

సిద్దిపేట రూరల్:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అవగాహన లేని పాలన అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లాకు వెళ్తూ మార్గ మధ్యంలో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పొన్నాల గ్రామ శివారులో స్థానిక నాయకులతో ముచ్చటించి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌కు రాజకీయ అనుభవంలేకపోవడంతో హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. అధికారంలోకి రాకముందు రెండున్నర మాసాల్లో విద్యుత్ తెస్తానని, రైతులకు ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రస్తుతం మూడు సంవత్సరాలంటూ కాలయాపన చేస్తున్నారన్నారు.

ప్రసుత్తం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ను ఉధృతంగా చేపట్టనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 128 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమానత్వ సాధన కోసం చట్టాలను ప్రజాస్వామ్యానికి అనుకూలంగా తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బొమ్మల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement