ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేద్దామని ప్రయత్నించినందుకు ఓ కానిస్టేబుల్ ప్రాణాలు పోయాయి!! ఈ దారుణ సంఘటన ఢిల్లీలో జరిగింది.
ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేద్దామని ప్రయత్నించినందుకు ఓ కానిస్టేబుల్ ప్రాణాలు పోయాయి!! ఈ దారుణ సంఘటన ఢిల్లీలో జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని జకీరా ఫ్లైఓవర్ దగ్గర నో ఎంట్రీ జోన్ లోకి ప్రవేశిస్తున్న కారును అడ్డుకునేందుకు కానిస్టేబుల్ మానా రామ్ వెళ్లగా, సదరు కారు డ్రైవర్ అతడిని 150 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లడమే కాదు.. చివరకు కారు చక్రాల కింద తొక్కించి అతడి మృతికి కారణమయ్యాడు. మానా రామ్కు భార్య, చెల్లెలు, రెండున్నరేళ్ల బిడ్డ ఉన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ రోడ్ల మీద మరణించిన ట్రాఫిక్ పోలీసులలో అతడు తొమ్మిదో వాడు.
ఆ కారు నో ఎంట్రీలోకి వెళ్తుండగా మానారామ్ ధైర్యంగా దాని బోనెట్ మీదకు దూకి ఆపేందుకు ప్రయత్నించాడు. కారు డ్రైవర్ అతడిని పడేసేందుకు కారును అటూ ఇటూ తిప్పుతూ ముందుకెళ్లాడు. 150 మీటర్లు అలాగే తీసుకెళ్లిన తర్వాత.. అతడిమీదనుంచి కారు పోనిచ్చాడు. తర్వాత కారుతో సహా పారిపోయిన ఆ డ్రైవర్ రమణ్ కాంత్ను పోలీసులు అరెస్టు చేశారు.