మెట్రో పనుల కారణంగా హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
బంజారాహిల్స్: మెట్రో పనుల కారణంగా హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు, వచ్చే నెల 1 నుంచి 30 వరకు జూబ్లీహిల్స్ రహదారుల్లో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు.
ఈ నెల 17 నుంచి 20 వరకు వెంకటగిరి నుంచి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 నుంచి రోడ్ నెం. 36 వైపు మళ్లించనున్నారు. అలాగే వచ్చే నెల 1 నుంచి 30 వరకు మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలను ఉషాకిరణ్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ క్లబ్ మీదుగా ప్రధాన రహదారిలో ఉన్న నాగదేవతా టెంపుల్ వైపు మళ్లిస్తారు.