డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చలాన్లు పడటం మామూలే! కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు తల దురద పెడితే గోక్కున్నా, జరిమానా బెడద తప్పదు. ఇదేం కొత్త రూల్ అని ఆశ్చర్యపోతున్నారా! ఈ మధ్య అమెరికాలో టిమ్ హాన్సెన్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ తల గోక్కున్నాడట. అంతే! పోలీసులు రూ. 33,211 జరిమానాను వడ్డించారు. నిజానికి అతనికి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడినందుకు ఫైన్ పడింది.
ఫొటోను కాస్త నిశితంగా పరిశీలిస్తే అతను ఫోన్ పట్టుకోలేదని తెలుస్తోంది. అతను తల గొక్కోవడాన్ని ఏఐ పవర్డ్ కెమెరా అపార్థం చేసుకుని, ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా భావించింది. స్మార్ట్ కెమెరా లోపం కారణంగానే ఇలా జరిగిందని స్పష్టమవడంతో ట్రాఫిక్ పోలీసులు అతని చలానాను రద్దు చేశారు. అయితే అప్పటికే ఆ జరిమానాపై టిమ్ కోర్టులో కేసు నమోదు చేశాడు. అధికారిక తీర్పు ఇంకా రాలేదు. ఇంతలోనే ఈ విషయం వైరల్ అయింది. కొన్ని సంస్థలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ల వినియోగాన్ని గుర్తించే కెమెరాలను ఇస్టాల్ చేయమని కోరుతుంటే, మరికొందరు తమకూ ఇలాంటి వింత జరిమానాలు పడ్డాయి అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment