ట్రాఫిక్లో అక్రమ్ బుక్కయ్యాడు | Wasim Akram fined for violating traffic rules in Lahore | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్లో అక్రమ్ బుక్కయ్యాడు

Published Sun, Feb 9 2014 9:38 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

ట్రాఫిక్లో అక్రమ్ బుక్కయ్యాడు - Sakshi

ట్రాఫిక్లో అక్రమ్ బుక్కయ్యాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్కు జరిమానా విధించారు. క్రికెట్లో స్లో ఓవరేట్ తదితర కారణాలతో జరిమానాలు వేయడం మామూలే.

లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్కు జరిమానా విధించారు. క్రికెట్లో స్లో ఓవరేట్ తదితర కారణాలతో జరిమానాలు వేయడం మామూలే. అయితే క్రికెట్ నుంచి రిటైరయిన అక్రమ్కు జరిమానా విధించింది లాహోర్ పోలీసులు. అక్రమ్ ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో 500 రూపాయిలు జరిమానా వేసినట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.

లాహోర్ నగరంలో పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో పరిమితికి మించిన వేగంతో అక్రమ్ కారు దూసుకెళ్లింది. అక్కడ 60 కిలో మీటర్లకు మించి వెళ్లకూడదనే నిబంధన ఉండగా, 78 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులు అక్రమ్ కారును ఆపి జరిమానా వేశారు. పాక్ మాజీ కెప్టెన్ మారు మాట్లాడకుండా జరిమానా చెల్లించి వెళ్లిపోయాడు. ఇదిలావుండగా ఇటీవల లాహోర్లోనే పాక్ టెస్టు బ్యాట్స్మన్ ఉమర్ అక్మల్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే గాక పోలీసు అధికారిపై దాడికి దిగాడు. పోలీసులు అతగాడిపై మూడు సెక్షన్ల కింది కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అక్మల్ బెయిల్పై విడుదలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement