సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ తెచ్చారు. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకవేళ లైన్స్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. అలాగే.. ఎవరైనా ఫ్రీ లెఫ్ట్‌ను గనుక బ్లాక్ చేస్తే ఫైన్‌ను రూ.1000 గా నిర్ణయించారు.
పుట్‌పాత్‌లపై దుకాణాదారులు వస్తువులు పెట్టడానికి వీల్లేదని, ఒకవేళ పెడితేగనుక భారీ జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అలాగే.. పాదాచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే గనుక రూ.600 ఫైన్ విధించనున్నారు. అయితే.. ఈ రూల్స్‌కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment