ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా | Central Cabinet approval on Motor Amendment bill | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 4 2016 9:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

దేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గతంలో రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఈ బిల్లు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండింది.

Advertisement
 
Advertisement
 
Advertisement