రూల్స్ బ్రేక్ చేస్తే రూ.2వేలు ఫైన్...
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం న్యూఢిల్లీలో కొత్తగా ప్రతిపాదించిన సరి-బేసి ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, 12 ఏళ్లలోపు పిల్లలతో ఉండి వాహనాలు డ్రైవ్ చేసే మహిళలు, సీఎన్జీ కార్లు వాడేవాళ్లు, వీఐపీలు ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని తెలిపారు. సరి-బేసి విధానం ఢిల్లీ సీఎం వాహనానికి అయినా నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ పేర్కొన్న 'సరి-బేసి' ట్రాఫిక్ రూల్స్ :
15 రోజుల ట్రయల్ రన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న సరి-బేసి ట్రాఫిక్ రూల్స్... రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు జడ్జీలు, డిప్యూటీ స్పీకర్, ఏవైనా అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ జాబితాలో ద్విచక్ర వాహనాలు, రక్షణశాఖ వాహనాలు, పైలట్ కార్లు, సీడీ నంబర్ ప్లేట్లు ఉండే ప్రత్యేక భద్రతా బలగాల వాహనాలకు కూడా సరి-చేసి ఫార్ములా వర్తించదని కేజ్రీవాల్ వివరించారు.
ఈ 15 రోజులకు గానూ అవసరమైన నిమిత్తం ఎమర్జన్సీ వాహనాలు, పీసీఆర్ లు దీని పరిధిలోకి రావు.
ప్రభుత్వ నిర్ణయం విజయవంతమైతే ఈ విధానాలను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు అదనంగా న్యూఢిల్లీలో మరో 6వేల బస్సులు రోడ్డెక్కనున్నాయి.
న్యూఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన 19 లక్షలకు పైగా నాలుగు టైర్ల వాహనాలున్నాయి. నూతన విధానం వల్ల రోజులో సగం వాహనాలు మాత్రమే తిరుగుతాయి.