
హుస్సేన్‌సాగర్ చుట్టూ రేపు ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదన్ కాలేజ్, నిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు.
హైదరాబాద్ సిటీ: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆదివారం 10కే, 5కే, 2కే రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 8 వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
♦ వీవీ విగ్రహం (ఖైరతాబాద్ చౌరస్తా) వైపు నుంచి ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదన్ కాలేజ్, నిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు.
♦ తెలుగుతల్లి చౌరస్తా వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హెలీప్యాడ్ లైన్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా పంపిస్తారు.
♦ ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం ఓల్డ్ గేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదికి పంపిస్తారు.
♦ లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కేఆర్ భవన్, తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్ మీనార్ (యూ టర్న్) మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ పైకి పంపిస్తారు.
♦ కర్బాలా వైపు నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను చిల్ట్రన్స్ పార్క్ నుంచి డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు.
♦ నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్క్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మీదుగా పంపిస్తారు.
♦ డీబీఆర్ మిల్స్ నుంచి ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్‌బండ్ మీదికి అనుమతించరు.