సాక్షి, హైదరాబాద్: సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. చలాన్లు వెంటనే విధించడం లేదని, మూడు రోజుల తర్వాత విధిస్తామని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
కొత్త రూల్స్ ఇవే..
► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా
► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా
► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా
ప్రస్తుతానికైతే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ అమలుపై తనిఖీ చేసినట్లు ఆనంద్ తెలిపారు. వీటిపై నాలుగు రోజుల తర్వాత పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు
Comments
Please login to add a commentAdd a comment