City Commissioner
-
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ (Future City) అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి కమిషనర్‌ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌సీడీఏ (FCDA) పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది.ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటిని గమనంలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న యువ అధికారులకు దీని పాలనపగ్గాలు కట్టబెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గతంలో రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక( 2013), డాక్టర్ ఎస్.హరీశ్(2015) పేర్లను పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. అలాగే గోపి (2016) పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.90 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో ఫోర్త్ సిటీ (Fourth City) అవసరం ఉందని సీఎం రేవంత్ నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా..మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో కార్యరూపం.. ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.చదవండి: కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్! -
21 ఏళ్ల తర్వాత సీవీ ఆనంద్‌కు అరుదైన అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసిన సర్కారు.. కొత్త కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ను తీసుకువచ్చింది. దీంతో ఏడాదిలో ఈయన నాలుగో కమిషనర్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కాగా.. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. మరో విశేషం ఏమిటంటే.. 21 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని సీపీగా నియమించడం. నగరానికి 61వ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2021లో తొలిసారిగా నియామకం.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్లకు డీసీపీ, ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేసిన ఆనంద్ 2021లో తొలిసారిగా సిటీ కొత్వాల్ అయ్యారు. ఆ ఏడాది డిసెంబర్ 25 నుంచి గత ఏడాది అక్టోబర్ 12 వరకు విధులు నిర్వర్తించిన సీవీ ఆనంద్... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్ 13 వరకు సందీప్ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని శనివారం బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ సీవీ ఆనంద్‌నే కొత్వాల్‌గా నియమించింది. నగర కమిషనరేట్ చరిత్రలో తొలిసారి.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 177 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ 1948 సెప్టెంబర్‌లో జరిగిన ఆపరేషన్ పోలోతో దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 45 మంది పోలీసు కమిషనర్లుగా పని చేశారు. కేవలం రెండు సందర్భాల్లోనే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పని చేశారు. ఈసారి ఆ కాలంలో ఏకంగా నలుగురు మారారు. ఆనంద్‌ది పునరాగమనం అయినప్పటికీ... ఈయన నాలుగో అధికారే. 1990లో మాత్రం మత కలహాలు సహా అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో నలుగురు పోలీసులు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఏడుగురికే... హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తొలి కొత్వాల్ హసన్ అలీ ఖాన్ నుంచి గత ఏడాది పోలీసు కమిషనర్‌గా వచి్చన కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరకు మొత్తం 60 మంది అధికారులు ఈ పోస్టులో పని చేశారు. సీవీ ఆనంద్ సంఖ్య 61 కాగా.. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్ కాలియా రావు, ఎస్పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఇలా పని చేయగలిగారు. 2003లో ఆర్పీ సింగ్ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్‌కు ఈ అరుదైన రికార్డు సాధించారు. చట్టం లేకపోయినా మహారాష్ట్ర తరహాలో.. నగర కొత్వాల్‌గా పునరాగమనం చేసిన ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో పోలీసు విభాగానికి నేతృత్వం వహిస్తున్న పోలీసు బాస్ డాక్టర్ జితేందర్‌ది 1992 బ్యాచ్. ఇలా డీజీపీ కంటే సీనియర్ అయిన అధికారి సిటీ కొత్వాల్‌గా నియమితులయ్యారు. ఈ విధానం ప్రత్యేక చట్టం ద్వారా మహారాష్ట్రలో ఉంది. అక్కడి ప్రత్యేక పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో డీజీపీ కంటే సీనియర్ అధికారినే ముంబై కమిషనర్‌గా నియమిస్తుంటారు. క్షేత్రస్థాయిలోనూ మహారాష్ట్ర డీజీపీ కన్నా ముంబై నగర కమిషనర్‌గా ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఉంటాయి.ఆదర్శ్‌నగర్ టు ‘బంజారాహిల్స్’..క్రికెట్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ తదితర క్రీడల్లోనూ తనదైన మార్కు కలిగిన సీవీ ఆనంద్ పూరీ్వకులది రంగారెడ్డి జిల్లాలోని కుంట్లూరు. ఆనంద్ కుటుంబం మాత్రం ఆదర్శ్‌నగర్‌లో నివసించేది. ఆయన పాతబస్తీలోని ప్రభుత్వ మెటరి్నటీ ఆస్పత్రిలో జని్మంచారు. హెచ్‌పీఎస్ నుంచి మొదలైన ఆయన విద్యాభ్యాసం ఐపీఎస్ వరకు వెళ్లింది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీ సీసీసీ), అందులోని పోలీసు కమిషనర్ కార్యాలయం సైతం ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ఆయన కొత్వాల్‌గా ఉండగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సహా అనేక విభాగాలకు అంకురార్పణ జరిగింది. -
అమ్మాయిలూ.. జర జాగ్రత్త!: హైదరాబాద్ సీపీ
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో అపరిచితులపట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య. అమ్మాయిలు వీలైనంత వరకు తమ ఫొటోలు, వివరాలను పోస్ట్ చేయొద్దని కోరారాయన. శనివారం నగర శాంతి భద్రతల అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. తాజాగా నగర పోలీసులు చేధించిన సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ సూచన చేశారు. కేసు వివరాలు.. సోషల్ మీడియాలో నగరానికి చెందిన ఇద్దరు బాలికలను కొందరు ఆగంతకులు ట్రాప్ చేశారు. ఈ మూడు నెలలుగా వాళ్ల మధ్య ఛాటింగ్ వ్యవహారం నడిచింది. బాలికల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారు ఆ కేటుగాళ్లు. చివరకు.. కోరికలు తీర్చకపోతే ఇంటర్నెట్లో ఆ ఫొటోలు, వీడియోలు పెడతామని బెదిరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులపై సీపీ శాండిల్య మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండు కేసులు నా దృష్టికి వచ్చాయి. ఈ రెండింటిలోనూ యువతులే బాధితులుగా ఉన్నారు. వాళ్ల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి దుండగులు బ్లాక్మెయిల్ చేశారు. ఆ బెదిరింపులతోనే అత్యాచారం చేశారు. ఈ రెండు ఘటనలు యువతులు ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకోవడం వల్లే.. అపరిచితులతో ఛాటింగ్ చేయడం వల్లే జరిగాయి. కాబట్టి ఎవరూ అలాంటి ట్రాప్‌ల్లో పడొద్దు.. బాధితులు కావొద్దు అని అన్నారాయన. మేమున్నాం.. ‘‘సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్లలో వ్యక్తిగత ఫొటోలు పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా సోషల్ మీడియాలో ప్రొఫైల్ లాక్ పెట్టుకోండి. అపరిచితుల నుంచి రిక్వెస్ట్ వస్తే అంగీకరించవద్దు. ప్రొఫైల్‌ను రెండు దశలుగా సెక్యూర్ పెట్టుకోండి. స్నేహితులతో, అపరిచితులతో వీడియో కాలింగ్ చేయొద్దు. ఎవరైనా బ్లాక్మెయిల్, ఒత్తిడి చేస్తే ఆందోళన చెందకండి. మీకు మేమున్నాం. ఎవరైనా ఇబ్బందులు పెడితే మా అన్న పోలీసు అని చెప్పండి. నేరుగా మా నెంబర్లను సంప్రదించండి.. ఫోన్ నెంబర్లు.. 9490616555, 8712660001 అమ్మాయిలు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే.. ఫిర్యాదు చెయ్యండి. పోలీసులను మీ సోదరులుగా భావించండి. నన్ను(కమిషనర్ శాండీ తనను తాను ఉద్దేశించుకుంటూ..) మీ అన్నగా భావించండి. మీ ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారాయన. తల్లిదండ్రులకు సూచన బీదర్ నుంచి మత్తు ట్యాబెట్లు తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. ఆ ముఠా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటోంది. బీదర్‌కు నిందితుల్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు పోలీసులపై నిందితులు దాడి చేశారు. దాడుల్లో నార్కోటిక్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. పిల్లల తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. వాళ్లతో కలిసి ఉండండి.. ఒంటరిగా వాళ్లను వదిలేయకుండా దృష్టి పెట్టండి. -
హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. చలాన్లు వెంటనే విధించడం లేదని, మూడు రోజుల తర్వాత విధిస్తామని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కొత్త రూల్స్ ఇవే.. ► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా ► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా ► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా ప్రస్తుతానికైతే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ అమలుపై తనిఖీ చేసినట్లు ఆనంద్ తెలిపారు. వీటిపై నాలుగు రోజుల తర్వాత పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు -
‘చిప్స్’తో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌ల్లో ఇంధనం పోసే యంత్రాల్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ అమర్చి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోన్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు, తూనికలు కొలతల శాఖ అధికారులు రట్టు చేశారు. 1,000 ఎంఎల్ ఇంధనానికి 970 ఎంఎల్ మాత్రమే పోసేలా చేసి లక్షల్లో డబ్బులు దండుకుంటున్న యజమానులతో పాటు ఈ వ్యవస్థీకృత నేరానికి ఆద్యులైన నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 14 ఇంటిగ్రేటెడ్ చిప్స్, 8 డిస్ప్లేలు, 3 జీబీఆర్ కేబుళ్లు, మదర్ బోర్డు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మోసాల క్రమంలో తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లో 22 పెట్రోల్ బంక్‌లను సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్‌తో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియాకు కేసు వివరాలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఎస్కే సుభాని బాషా అలియాస్ బాషా పదేళ్లకుపైగా పెట్రోల్ బంక్ మెకానిక్‌గా పనిచేశాడు. తనకున్న అనుభవంతో.. కస్టమర్ అడిగిన దానికన్నా తక్కువగా పోసినా.. డిస్ప్లేలో మాత్రం సరిగా కనిపించేలా ఇంటిగ్రేటెడ్ చిప్స్ అమర్చి సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన జోసెఫ్, శిబు థామస్ సాఫ్ట్వేర్ సాయంతో తయారుచేసిన చిప్స్‌ను రూ.80 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు కొన్నాడు. వాటిని ఏలూరుకు చెందిన బాజీ బాబా, శంకర్, మల్లేశ్వరరావుల సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులను ఒప్పించి వారి బంకుల్లో అమర్చాడు. మోసం చేసేదిలా.. ఒక్కో పెట్రోల్ బంక్‌లో రెండు ఇంధన పంప్‌లు ఉంటే ఒక్కదాంట్లో ఈ చిప్‌ను అమర్చేవారు. పంప్ లోపల ఒకటి, బయట కస్టమర్లకు కనిపించే డిస్ప్లే బోర్డుకు మరో చిప్ అమర్చేవారు. ఇంధనం కొనుగోలుకు వచ్చిన వ్యక్తి లీటర్ పోయమంటే 970 ఎంఎల్ మాత్రమే పోసేవారు. డిస్ప్లేలో మాత్రం లీటర్ పోసినట్టే కనిపించేది. ఆయిల్ కార్పొరేషన్ బృందాలు తనిఖీకి వచ్చినపుడు ఆయా ఇంధన యంత్రాలను చెక్‌చేసి సీల్ వేసేవి. ఆపై ఈ ముఠా రంగంలోకి దిగి సీల్ కట్‌చేసి చిప్ అమర్చి అదే కేబుల్ వైర్ వాడేది. ఎవరైనా తనిఖీకి వస్తే.. మెయిన్ స్విచ్ ఆఫ్‌చేసి ఆన్‌చేస్తే మళ్లీ 1,000 ఎంఎల్ చూపేలా మదర్‌బోర్డును డిజైన్ చేశారు. ఇలా సుభాని గ్యాంగ్ ఏడాదిగా తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతోంది. దీనిపై ఉప్పందుకున్న నందిగామ పోలీసు ఇన్స్పెక్టర్ రామయ్య, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం, తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి పెట్రోల్ బంక్‌లపై దాడి చేసి సుభాని గ్యాంగ్‌ను పట్టుకొని తెలంగాణలో 11 పెట్రోల్ బంక్‌లు సీజ్ చేశారు. 9మంది పెట్రోల్ బంక్ యజమానులను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో ఏపీలో 22 పెట్రోల్ బంక్‌లను సీజ్ చేశారు. మోసగాళ్లను పట్టుకోవడంలో చురుగ్గా పనిచేసిన సిబ్బందిని సజ్జనార్ రివార్డులతో సన్మానించారు. -
‘సెక్యూరిటీ’ వార్!
సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: భారతీయజనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ల మధ్య సెక్యూరిటీ అంశాలకు సంబంధించి కోల్డ్ వార్ మొదలైంది. ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కొత్వాల్.. ఎమ్మెల్యేకు లేఖ రాయగా, అసలు ఆ ముప్పు ఎవరి నుంచో చెప్పాలంటూ రాజాసింగ్ నిలదీయడంతో పోలీసు శాఖకు చిక్కొచ్చి పడింది. అలాగే పోలీసు కమిషనర్ రాసిన రహస్య (కాన్ఫిడెన్షియల్) లేఖ సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. కొన్ని గంటల తర్వాత ఆ లేఖ అనుకోకుండా బయటకు వచ్చిందని ప్రచారమైంది. బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతం నుంచే ముప్పు పొంచి ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. అయితే అది ఇటీవలి కాలంలో మరింత తీవ్రమైందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మిగతా ఎమ్మెల్యేలకు లేని విధంగా ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ (బీపీ) కారు సమకూర్చాలని నిఘా విభాగం అధికారులు సిఫారసు చేశారు. ఇటీవల ముప్పు తీవ్రమైన నేపథ్యంలోనే రాజాసింగ్ భద్రతాధికారుల్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నామని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు అదనపు సూచనలు, శిక్షణ కూడా ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఆయన పలు మార్లు కారును వదిలి ద్విచక్ర వాహనంపై ప్రజల్లోకి వెళ్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. దీని వల్ల మరింత ముప్పు ఉందని, తాము అందించిన బీపీ కారునే వాడాలని, భద్రతకు సంబంధించి అంశాల్లో తమకు సహకరించాలని సూచిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ నెల 24న ఎమ్మెల్యేకు ఓ కాన్ఫిడెన్షియల్ లేఖ రాశారని తెలుస్తోంది. అయితే ఇందులోని తేదీని ఈ నెల 28వ తేదీగా మార్ఫ్ చేసిన కొందరు వ్యక్తులు దానిని సోషల్ మీడియాలో పెట్టారు. ఇది శనివారం హల్చల్ చేసింది. బుల్లెట్‌పైనే తిరుగుతా.. ఇదిలా ఉండగా ఈ అంశంపై రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఎవరి వల్ల ముప్పు పొంచి ఉందో, ఆ విషయాన్ని పోలీసులు తక్షణం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా తనకు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు తనకు కొత్తగా ఎవరి నుంచి హాని పొంచి ఉంది, ఇటీవల ఏ రకంగా ఆ ముప్పు పెరిగిందో తెలపాలని డిమాండ్ చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజలను కలుసుకోవడానికి బుల్లెట్ వాహనంపై తిరుగుతానని స్పష్టంచేశారు. తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో తెలపాలని కోరుతూ డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖలు రాస్తున్నట్లు చెప్పారు. -
'త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు'
-
20 వేల మందితో బందోబస్తు: కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గురువారం జరుగనున్న గణేష్ సామూహిక నిమజ్జనం నేపథ్యంలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రజలు, మండపాల నిర్వాహకులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం ఏర్పాట చేసుకుని పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం పవిత్రమైన కార్యక్రమం కావడంతో అది రాహుకాలంలో జరుగకుండా ఉండేలా ప్రజల్లో అవకాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ముప్పు పొంచి ఉందంటూ ఎలాంటి హెచ్చరికలు అందలేదని, అయినప్పటికీ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు విభాగం చేస్తున్న బందోబస్తు, భద్రత ఇతర ఏర్పాట్లు ఇవి... ట్యాంక్‌బండ్ పైన 24, ఎన్టీఆర్ మార్‌్గలో 10 చొప్పున మొత్తం 34 క్రేన్లు ఏర్పాటు చేశారు. ప్రతి నాలుగు క్రేన్లకూ ఓ ఉన్నతాధికారి పర్యవేక్షణకుడిగా ఉంటారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 12 వేల శాశ్వత సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటికి అదనంగా నిమజ్జనం మార్గంలో రెండు వేలు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ తాత్కాలిక ప్రాతిపదికన 44 సీసీ, పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, టూరిజం శాఖల సహకారంతో ప్రత్యేక బోట్లు, గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు. ఈవ్‌టీజర్లు, నేరగాళ్ళ కట్టడికి ప్రత్యేకంగా 100 ‘షీ–టీమ్’ బృందాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం, ప్రధాన ఉరేగింపుపై డేగకన్ను వేసిన పోలీసులు నిత్యం కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌నుంచి పర్యవేక్షించనున్నారు. -
శివాజీ విగ్రహ బాధ్యతను తీసుకోండి
నగర కమిషనర్‌కు లేఖ రాసిన మేయర్ స్నేహల్ ఇంకా అందలేదన్న సీతారామ్ కుంటే సాక్షి, ముంబై: శివాజీ పార్క్‌లో ఉన్న మరాఠీ యోధుడు శివాజీ మహారాజ్ విగ్రహ నిర్వహణ బాధ్యతను బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) తీసుకోవాల్సిందిగా మేయర్ స్నేహల్ అంబేకర్ మున్సిపల్ కమిషనర్‌ను కోరింది. విగ్రాహ నిర్వహణ బాధ్యతను ఎవ్వరూ సక్రమంగా చేయలేదనే విషయాన్ని ఎమ్మెన్నెస్ కార్పొరేటర్ సంతోష్ దురే స్నేహల్ దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్నేహల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివాజీ విగ్రహ నిర్వహణ బాధ్యత తీసుకోవాల్సిందిగా కార్పొరేషన్‌ను కోరినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌కు కూడా లేఖ రాసినట్లు తెలిపారు. బీఎంసీ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) నుంచి శివాజీ విగ్రహ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఎమ్మెన్నెస్ కార్పోరేటర్ సంతోష్ దురే.. బీఎంసీ ఆధీనంలో ఈ విగ్రహం నిర్వహణ జరగాలని, పీడబ్ల్యూడీ ఈ విగ్రహం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. సమన్వయ లోపం వల్ల బీఎంసీనే విగ్రహ నిర్వహణ చూస్తుందని పీడబ్ల్యూడీ భావించిందని చెప్పారు. అయితే మేయర్ సీతారామ్ కుంటే మాత్రం అంబేకర్ నుంచి ఎలాంటి లేఖను అందుకోలేదని చెబుతున్నారు. ‘లేఖ అందితేనే కదా అందులో ఏం రాసి ఉందో తెలిసేది’ అని అంటున్నారు. విగ్రహ నిర్వహణను బీఎంసీ తన ఆధీనంలోకీ తెచ్చుకోవాలని లీడర్ ఆఫ్ ద హౌజ్ తృష్ణ విశ్వాస్ రావ్ అభిప్రాయపడ్డారు. గతేడాది పీడబ్ల్యూడీ.. శివాజీ విగ్రహ నిర్వహణను చూడాలని బీఎంసీకి లేఖ రాసింది. అయితే ఇంతకు మునుపే విగ్రహ నిర్వహణ కోసం అనుమతి కోరామని, కానీ పీడబ్ల్యూడీ నుంచి సమాధానం రాలేదని కార్పొరేషన్ ఆరోపిస్తోంది. విగ్రహ బాధ్యతను బీఎంసీ చేపట్టకుంటే తాము చేపడతామని ఎమ్మెన్నెస్ ఇటీవల ప్రక టించింది.