- ట్యాంక్‌బండ్ పైన 24, ఎన్టీఆర్ మార్‌్గలో 10 చొప్పున మొత్తం 34 క్రేన్లు ఏర్పాటు చేశారు. ప్రతి నాలుగు క్రేన్లకూ ఓ ఉన్నతాధికారి పర్యవేక్షణకుడిగా ఉంటారు.
- ప్రస్తుతం నగర వ్యాప్తంగా 12 వేల శాశ్వత సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటికి అదనంగా నిమజ్జనం మార్గంలో రెండు వేలు ఏర్పాటు చేశారు.
- హుస్సేన్‌సాగర్ చుట్టూ తాత్కాలిక ప్రాతిపదికన 44 సీసీ, పీటీజెడ్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- ఎన్డీఆర్‌ఎఫ్, టూరిజం శాఖల సహకారంతో ప్రత్యేక బోట్లు, గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు.
- ఈవ్‌టీజర్లు, నేరగాళ్ళ కట్టడికి ప్రత్యేకంగా 100 ‘షీ–టీమ్’ బృందాలను ఏర్పాటు చేశారు.
- నిమజ్జనం, ప్రధాన ఉరేగింపుపై డేగకన్ను వేసిన పోలీసులు నిత్యం కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌నుంచి పర్యవేక్షించనున్నారు.
20 వేల మందితో బందోబస్తు: కొత్వాల్
Published Wed, Sep 14 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గురువారం జరుగనున్న గణేష్ సామూహిక నిమజ్జనం నేపథ్యంలో 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రజలు, మండపాల నిర్వాహకులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం ఏర్పాట చేసుకుని పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం పవిత్రమైన కార్యక్రమం కావడంతో అది రాహుకాలంలో జరుగకుండా ఉండేలా ప్రజల్లో అవకాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ముప్పు పొంచి ఉందంటూ ఎలాంటి హెచ్చరికలు అందలేదని, అయినప్పటికీ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
పోలీసు విభాగం చేస్తున్న బందోబస్తు, భద్రత ఇతర ఏర్పాట్లు ఇవి...
Advertisement