ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో భారీ స్థాయిలో మార్పులకు నాంది పలికారు. అందులో ప్రధానంగా ఉద్యోగుల తీసివేత, అది కూడా ట్విటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలగింపులు ఉండడంతో అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులను తొలగిస్తూ ట్విటర్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.
ఈ అంశంపై స్పందిస్తూ.. భారత్‌లో ట్విటర్ ఉద్యోగుల అకస్మిక తొలగింపు సరైన చర్యకాదన్నారు. తొలగించిన వారికి మరో ఉద్యోగంలో మారేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.దేశంలో దాదాపు 150-180 మంది ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో సగం మందిని తొలగించిన సంగతి తెలిసిందే. భారత్‌లో సేల్స్ నుంచి మార్కెటింగ్ వరకు, కంటెంట్ క్యూరేషన్ నుంచి కార్పొరేట్ కమ్యూనికేషన్‌ల విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు.
ఇదిలా ఉండగా ట్విట్టర్ ఇండియాలో మిగిలిన ఉద్యోగులు కూడా భవిష్యత్తులో తమ పరిస్థతి ఏంటని భయంతో జీవిస్తున్నారు. మరో వైపు మస్క్ మాత్రం ట్విట్టర్ సంస్థ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున కంపెనీలోని సగం మంది ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు.
చదవండి: ట్విటర్‌కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ
Comments
Please login to add a commentAdd a comment