employee lay-offs
-
అసలేం జరుగుతోంది, ఊడిపోతున్న ఉద్యోగాలు.. ప్రముఖ కంపెనీలో 11వేల మందిపై వేటు!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం కంపెనీలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులపై తాజాగా స్పందించారు. తమ కంపెనీలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం ( 11,000 మందికి) పైగా ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్బుక్ సీఈఓ ఉద్యోగులకు రాసిన లేఖలో.. “ఈ రోజు నేను మెటా చరిత్రలో చేసిన కొన్ని కష్టతరమైన మార్పులను షేర్ చేస్తున్నాను. నేను మా బృందం పరిమాణాన్ని సుమారు 13% తగ్గించాలని నిర్ణయించుకున్నాను. మా ప్రతిభావంతులైన ఉద్యోగులలో 11,000 కంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నాం. ఇది నాకు ఎంతో బాధను కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు జుకర్‌బర్గ్. ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి కనీసం నాలుగు నెలల జీతాన్ని అందించనున్నట్లు సంస్థ హెచ్ఆర్ విభాగం అధిపతి లోరీ గోలెర్ తెలిపారు. ఇక ఈ ఉద్యోగాల తొలగింపు కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో భారీగా తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అకస్మాత్తుగా ఉద్యోగుల తొలగింపుకు ప్రధాన కారణాలు..కంపెనీ ఖర్చను భారీగా తగ్గించుకోవడం, ఆర్ధిక మాంద్యం కారణంగా సంస్థలు అడ్వటైజ్మెంట్లకు కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవడం, కంపెనీని ఇటీవల వరుసగా చుట్టుముడుతున్న వివాదాల కారణంగా సంస్థపై నియంత్రణ వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
నా కొడుక్కి క్యాన్సర్.. ఇలా జరుగుతుందని ఊహించలేదు: ట్విటర్ ఉద్యోగి ఆవేదన
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ మధ్య డీల్ కుదిరినప్పటి నుంచి ఈ అంశం నెట్టింట మారుమోగుతోంది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య చివరికి ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు మస్క్. అలా భాధ్యతలు తీసుకున్నాడో లేదో సంస్థలోని భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. తాజాగా ఓ ట్విటర్ ఉద్యోగి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విటర్ తీసుకున్న తర్వాత అందులో పని చేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ప్రశార్థకమైంది. కొందరిని ఇప్పటికే ఇంటికి సాగనంపగా, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లోనూ లే ఆఫ్‌ల భయం వెంటాడుతూ ఉంది. ఇన్ని పరిణామాల మధ్య ఓ ఉద్యోగి తన గోడు వెల్లబోసుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన కొడుకుకి అండగా ఉండేందకు సెలవులు తీసుకున్నట్లు తెలిపాడు. అయితే ఆశ్చర్యకరంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని సదరు ఉద్యోగి వాపోయాడు. అండగా ఉండాల్సిన సమయంలో సంస్థ ఇలా ప్రవర్తించడం సరికాదని తన అవేదన వ్యక్తం చేశాడు. మరో వైపు ..ట్విటర్ సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని.. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు మస్క్. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు. చదవండి: నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా! -
ట్విటర్ ఉద్యోగుల తొలగింపు సరైంది కాదు, అలా చేసుండాల్సింది: కేంద్రం ఆగ్రహం!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో భారీ స్థాయిలో మార్పులకు నాంది పలికారు. అందులో ప్రధానంగా ఉద్యోగుల తీసివేత, అది కూడా ట్విటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలగింపులు ఉండడంతో అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులను తొలగిస్తూ ట్విటర్ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. ఈ అంశంపై స్పందిస్తూ.. భారత్‌లో ట్విటర్ ఉద్యోగుల అకస్మిక తొలగింపు సరైన చర్యకాదన్నారు. తొలగించిన వారికి మరో ఉద్యోగంలో మారేందుకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.దేశంలో దాదాపు 150-180 మంది ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో సగం మందిని తొలగించిన సంగతి తెలిసిందే. భారత్‌లో సేల్స్ నుంచి మార్కెటింగ్ వరకు, కంటెంట్ క్యూరేషన్ నుంచి కార్పొరేట్ కమ్యూనికేషన్ల విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ ఇండియాలో మిగిలిన ఉద్యోగులు కూడా భవిష్యత్తులో తమ పరిస్థతి ఏంటని భయంతో జీవిస్తున్నారు. మరో వైపు మస్క్ మాత్రం ట్విట్టర్ సంస్థ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున కంపెనీలోని సగం మంది ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే మార్గం లేదంటున్నారు. చదవండి: ట్విటర్‌కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ -
600 మందిపై వేటువేసిన టాటా
రిలయన్స్ జియో ఎంట్రీ ఇటు కస్టమర్లకు ప్రయోజనాలు ఏమో కానీ, ఉద్యోగుల, కంపెనీల పొట్టను కొడుతోంది. టెలికాం ఇండస్ట్రీలో భారీ నష్టాలతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు. తాజాగా టాటా టెలిసర్వీసెస్ కంపెనీ 500 నుంచి 600 మంది ఉద్యోగులను తీసేసినట్టు తెలిసింది. టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక, ఉద్యోగులపై వేటు వేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. సేల్స్, ఇతర సంబంధిత విభాగాల్లో పనిచేసే 500-600 మందిపై లేఆఫ్ ప్రభావం పడనుందని ఇద్దరు కంపెనీకి చెందిన వ్యక్తులు చెప్పారు. ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకెజ్ కూడా కంపెనీ ఆఫర్ చేసిందని తెలిపారు. ఒక్కో ఏడాది సర్వీసుకు నెల వేతనాన్ని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే దీనిపై టాటా టెలిసర్వీసెస్ ఇంకా స్పందించలేదు. టెలికాం ఇండస్ట్రీకి ఇది చాలా ఛాలెంజింగ్ సమయమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ జియో ఎంట్రీతో నెలకొన్న తీవ్రమైన టారిఫ్ వార్ తోనే టెలికాం ఇండస్ట్రీ ఈ ఉద్యోగాల కోతను భరించాల్సి వస్తుందన్నారు. జియో సంచలన ఆఫర్లు ఉద్యోగుల పొట్టను కొడతాయని ఇప్పటికే చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన జియో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఇండస్ట్రీ రుణం దాదాపు 4.6 లక్షల కోట్లకు ఎగిసింది. టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ, దేశవ్యాప్తంగా 19 టెలికాం సర్కిళ్లలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జీఎస్ఎం, సీడీఎమ్ఏ, 3జీ ప్లాట్ ఫామ్స్ పై టాటా టెలిసర్వీసెస్ వైర్ లెస్, వైర్ లైన్ నెట్ వర్క్స్ ను తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అంచనాల ప్రకారం 2017 ఫిబ్రవరి 28కి కంపెనీ మొబైల్ సబ్ స్క్రైబర్ బేస్ 51.2 మిలియన్ పెరిగింది. దీంతో మొత్తంగా కంపెనీ మొబైల్ సబ్ స్క్రైబర్ బేస్ 1.16 బిలియన్ కంటే ఎక్కువగానే ఉంది.