ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ మధ్య డీల్ కుదిరినప్పటి నుంచి ఈ అంశం నెట్టింట మారుమోగుతోంది. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య చివరికి ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు మస్క్. అలా భాధ్యతలు తీసుకున్నాడో లేదో సంస్థలోని భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ప్రస్తుతం భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. తాజాగా ఓ ట్విటర్ ఉద్యోగి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది.
ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విటర్ తీసుకున్న తర్వాత అందులో పని చేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ప్రశార్థకమైంది. కొందరిని ఇప్పటికే ఇంటికి సాగనంపగా, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లోనూ లే ఆఫ్‌ల భయం వెంటాడుతూ ఉంది. ఇన్ని పరిణామాల మధ్య ఓ ఉద్యోగి తన గోడు వెల్లబోసుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన కొడుకుకి అండగా ఉండేందకు సెలవులు తీసుకున్నట్లు తెలిపాడు. అయితే ఆశ్చర్యకరంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని సదరు ఉద్యోగి వాపోయాడు.
అండగా ఉండాల్సిన సమయంలో సంస్థ ఇలా ప్రవర్తించడం సరికాదని తన అవేదన వ్యక్తం చేశాడు. మరో వైపు ..ట్విటర్ సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని.. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు మస్క్. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు.
చదవండి: నోట్ల రద్దుకు 6 ఏళ్లు.. ప్రజల వద్ద ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment