ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ప్రజలు సానుకూలంగానే ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. దీని ద్వారా నేతల కంటే ప్రజలు తెలివైన వారని మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. శనివారం విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు అభినందన సభ ఏర్పాటు చేశారు.