గడువులోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు.
న్యూఢిల్లీ: గడువులోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఆమెతో భేటీ అయిన సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశంపైనే వారిరువురు చర్చించుకున్నారు.
అనంతరం ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు నదుల అనుసంధానం చేయడం గర్వకారణంగా ఉందని తెలిపారు.