మోదీ నాయకత్వంలో అభివృద్ధి దిశగా భారత్ | venkaiah naidu attends swachh bharat | Sakshi
Sakshi News home page

మోదీ నాయకత్వంలో అభివృద్ధి దిశగా భారత్

Published Sun, Nov 15 2015 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

మోదీ నాయకత్వంలో అభివృద్ధి దిశగా భారత్

మోదీ నాయకత్వంలో అభివృద్ధి దిశగా భారత్

విజయవాడ : నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో స్వచ్ఛ భారత్ పనులను వెంకయ్యనాయుడు పరిశీలించారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్ తఅంటే ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజా ఉద్యమం అని ఆయన స్పష్టం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే అనారోగ్యాలు చేరతాయని ప్రజలకు వెంకయ్య సూచించారు. మడమ తిప్పని మహానేత ఎన్టీఆర్ అని అభివర్ణించారు. మహనీయుల నుంచి మనం స్ఫూర్తి పోందాలని సూచించారు. ప్రస్తుత మానవ జీవితం యాంత్రికమైపోయిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement