ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల మూసివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల మూసివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. క్టస్టరైజేసన్, రేషనలైజేషన్, పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఏఒక్క పాఠశాల మూతపడట్లేదని కేంద్రప్రభుత్వం తెలిపింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పాఠశాలలు మూసివేయబడుతున్నాయని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల శాఖా సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు.
రాష్ట్రంలో ఉన్న ఏఒక్క పాఠశాలలను మూసివేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని మంత్రి తెలిపారు. అయితే విద్యార్థుల సంఖ్య 30మంది కన్నా తక్కువగా ఉన్న 1434 ప్రాధమిక పాఠశాలలను సంఘటితం చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఈ ప్రక్రియను కూడా చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు.