కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం ఖిలావరంగల్ కోటను సందర్శించారు.
ఖిలా వరంగల్ : కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం ఖిలావరంగల్ కోటను సందర్శించారు. కేంద్రం తలపెట్టిన హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన (హృదయ్) పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా భద్రకాళి ఆలయం, వేయిస్తంభాల గుడిలోని శిల్పకళా సంపదను మంత్రి తిలకించారు. 18 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 4.5 కిలోమీటర్ల మేర జరుగుతున్న అగడ్త తవ్వకం పనులను కూడా వెంకయ్యనాయుడు పరిశీలించారు.