సాక్షి, న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 95 మొబైల్ తయారీ కంపెనీలు దేశంలో తమ ప్లాంట్‌లను ఏర్పాటు చేశాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి భారత్ హబ్‌గా మారుతున్నదని అన్నారు. భారత్‌కు వచ్చిన మొబైల్ తయారీ ప్లాంట్‌ల్లో 32 ప్లాంట్‌లు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ఏర్పాటయ్యాయని తెలిపారు. సిలికాన్‌వ్యాలీలో జరిగే ఐటీ నూతన ఆవిష్కరణల్లో 14 శాతం భారత్‌కు చెందిన వారి మేథోశక్తి ఫలితమేనని అన్నారు.
ఐఐటీల్లో చదివి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలను వదిలి దేశానికి తిరిగివస్తున్నారని, వారు స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు.న్యాయ ప్రక్రియ వేగవంతానికి డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.