రైతుల పట్ల కాంగ్రెస్ ది మొసలి కన్నీరు | Venkaiah naidu takes on congress party | Sakshi
Sakshi News home page

రైతుల పట్ల కాంగ్రెస్ ది మొసలి కన్నీరు

Published Fri, Sep 18 2015 12:47 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రైతుల పట్ల కాంగ్రెస్ ది మొసలి కన్నీరు - Sakshi

రైతుల పట్ల కాంగ్రెస్ ది మొసలి కన్నీరు

న్యూఢిల్లీ : గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ రైతుల నుంచి 10 లక్షల ఎకరాల భూమిని సేకరించిందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూమికి 4 రెట్లు నష్ట పరిహారం ఇచ్చారా అని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. శుక్రవారం వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట విలన్ అని అభివర్ణించారు.

రైతుల విషయంలో ఆ పార్టీ మొసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఏమీ చేసిందో ట్యాలీ చేసుకుని ర్యాలీలో చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి వెంకయ్య హితవు పలికారు. తమ ప్రభుత్వం తీసుకువస్తున్న భూసేకరణ పథకంలో 4 రెట్లు నష్ట పరిహారం ఇస్తున్నామని వెంకయ్య చెప్పారు. బ్రిటీష్ చట్టాలను ఉపయోగించి ఒక్క హర్యానాలోనే 70 వేల ఎకరాల భూమిని కాంగ్రెస్ సేకరించిందని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement