సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర మంత్రులు రాజకీయ దుమారం రేపుతున్నారు. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో పర్యటన చేపట్టారు. గురువారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె ఘాటైన విమర్శలు చేయడం తెలిసిందే.
ఇక శుక్రవారం బీర్కూర్‌లో జిల్లా కలెక్టర్‌ను రేషన్ బియ్యంపై నిలదీయడం చర్చనీయాంశమ య్యింది. ఈ పథకం కింద కిలో బియ్యానికి రూ.35 వరకు ఖర్చవుతుంటే, కేంద్రం 28 చెల్లిస్తున్న విషయాన్ని వెల్లడించడంతో పాటు రేషన్ షాపుల్లో మోదీ చిత్రపటాలు పెట్టాలంటూ ఆదేశించడం టీఆర్‌ఎస్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో పర్యటించిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర సర్కార్, గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రాష్ట్ర మంత్రులు స్పందించడం తెలిసిందే.
14 ఎంపీ స్థానాల్లో..పక్కా వ్యూహంతో
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో (బీజేపీ సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహాయించి) పర్యటించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయా లని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని సూచించింది. విభిన్న పథకాల ద్వారా వివిధ వర్గాల పేదలకు కేంద్రం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర వాటాగా అందజేస్తున్న నిధులు కేంద్రమంత్రుల ద్వారా వివరిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుందనే భావనతో బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు జిల్లాల్లో మకాం వేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా..
లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా ఈ పర్యట నలు కొనసాగనున్నాయి. ఇప్పటికే హైదరా బాద్ లోక్‌సభ పరిధిలో జ్యోతిరాధిత్య సింధియా, ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానంలో పురు షోత్తం రూపాలా, మల్కాజిగిరిలో ప్రహ్లాద్ జోషి, నల్లగొండలో కైలాష్‌చౌదరి, భువనగి రిలో దేవీసింగ్, ఖమ్మంలో బీఎల్ వర్మ పర్యటించారు. తాజాగా నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పర్యటన చేపట్టారు. ఇక మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శుక్రవారం నుంచి పర్యటన ప్రారంభించారు. ఈ నెల 4,5 తేదీల్లో మహబూబా బాద్ ఎంపీ స్థానంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు. ఇప్పటికే పర్యటించినా మళ్లీ నెలా, రెండునెలల వ్యవధిలో మరోసారి తమకు కేటాయించిన లోక్‌సభ సీట్ల పరిధిలో పర్యటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment