
సాక్షి, రాయచూరు(కర్ణాటక): ప్రముఖులు వచ్చినప్పుడు పూలదండలు, మేళతాళాలతో స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే కేంద్ర సహాయ మంత్రికి ఓ మాజీ మంత్రి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తుపాకులతో కాల్పులు జరిపి స్వాగతించారు. యాదగిరిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బీజేపీ జనాశీర్వాద యాత్రలో పాల్గొనడానికి కొత్తగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి అయిన భగవంత్ ఖూబా బుధవారం యాదగిరికి వచ్చారు.
మాజీ మంత్రి బాబురావ్ చించనసూరూ, మరో నలుగురు తుపాకులు తీసుకొని ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మంత్రికి వినూత్న స్వాగతం పలికారు. కాల్పుల శబ్ధం విని కార్యకర్తలు భీతిల్లారు. కాగా కాల్పులు జరిపిన నింగప్ప, మాళప్ప, శరణప్ప, రేణప్పలపై యాదగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. మాజీ మంత్రి బాబురావ్‌పై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment