fertilizer minister
-
మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి స్పందిస్తూ..‘రైతులకు తక్కువ ధరకు ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. కొన్ని ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలకు ఇప్పటికే 100 శాతం రాయితీలు అందించాం. రిటైల్ దుకాణంలో అమర్చిన పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల ద్వారా ఆధార్‌తో రైతులు సబ్సిడీపై ఎరువులు పొందుతున్నారు’ అని చెప్పారు.2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం అందిస్తున్న ఎరువుల సబ్సిడీ వివరాలను మంత్రి తెలియజేశారు.2010-11లో రూ.65,836.68 కోట్లు2011-12లో రూ.74,569.83 కోట్లు2012-13లో రూ.70,592.1 కోట్లు2013-14లో రూ.71,280.16 కోట్లు2014-15లో రూ.75,067.31 కోట్లు2015-16లో రూ.76,537.56 కోట్లు2016-17లో రూ.70,100.01 కోట్లు2017-18లో రూ.69,197.96 కోట్లు2018-19లో రూ.73,435.21 కోట్లు2019-20లో రూ. 83,466.51 కోట్లు2020-21లో రూ. 1,31,229.5 కోట్లు2021-22లో రూ. 1,57,640.1 కోట్లు2022-23లో రూ.2,54,798.9 కోట్లు2024-25లో జులై 2024 వరకు అందించిన సబ్సిడీ రూ.36,993.39 కోట్లు‘చట్టబద్ధంగా 45 కిలోల యూరియా బ్యాగ్ రూ.242 (ఛార్జీలు, పన్నులు మినహాయింపు)గా ఉంది. యూరియా ఉత్పత్తికి అయ్యే వాస్తవ ఖర్చులు, రైతులకు అందిస్తున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. అందుకోసం ప్రభుత్వ సబ్సిడీలు ఉపయోగపడుతున్నాయి. ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి న్యూట్రియంట్ బేస్ట్ సబ్సిడీ(ఎన్బీఎస్) విధానాన్ని అమలు చేస్తోంది. ఎరువుల ధరలు వాటి ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. క్రమంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్లో మార్పులుంటాయి’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: దివాలా దిశగా అగ్రరాజ్యం!2010-11 నుంచి ఎరువుల ఉత్పత్తి వివరాలను మంత్రి వెల్లడించారు.2010-11లో 376.25 లక్షల టన్నులు2011-12లో 387.78 లక్షల టన్నులు2012-13లో 374.94 లక్షల టన్నులు2013-14లో 380.46 లక్షల టన్నులు2014-15లో 385.39 లక్షల టన్నులు2015-16లో 413.14 లక్షల టన్నులు2016-17లో 414.41 లక్షల టన్నులు2017-18లో 413.61 లక్షల టన్నులు2018-19లో 413.85 లక్షల టన్నులు2019-20లో 425.95 లక్షల టన్నులు2020-21లో 433.68 లక్షల టన్నులు2021-22లో 435.95 లక్షల టన్నులు2022-23లో 485.29 లక్షల టన్నులు2023-24లో 503.35 లక్షల టన్నులు -
కేంద్రమంత్రికి కాల్పులతో స్వాగతం?
సాక్షి, రాయచూరు(కర్ణాటక): ప్రముఖులు వచ్చినప్పుడు పూలదండలు, మేళతాళాలతో స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే కేంద్ర సహాయ మంత్రికి ఓ మాజీ మంత్రి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తుపాకులతో కాల్పులు జరిపి స్వాగతించారు. యాదగిరిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బీజేపీ జనాశీర్వాద యాత్రలో పాల్గొనడానికి కొత్తగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి అయిన భగవంత్ ఖూబా బుధవారం యాదగిరికి వచ్చారు. మాజీ మంత్రి బాబురావ్ చించనసూరూ, మరో నలుగురు తుపాకులు తీసుకొని ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మంత్రికి వినూత్న స్వాగతం పలికారు. కాల్పుల శబ్ధం విని కార్యకర్తలు భీతిల్లారు. కాగా కాల్పులు జరిపిన నింగప్ప, మాళప్ప, శరణప్ప, రేణప్పలపై యాదగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు యాదగిరి జిల్లా ఎస్పీ వేదమూర్తి తెలిపారు. మాజీ మంత్రి బాబురావ్‌పై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు. -
ఫార్మా కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ!
ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం తెలిపారు. కొత్త శాఖ ఫార్మా పరిశ్రమ బాగోగులు చూడటంతో పాటు నియంత్రణ సంస్థగా కూడా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లే ఫార్మా కోసం కూడా ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశీ ఫార్మా రంగం విలువ దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. కొత్త ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్, ఫార్మా దిగుమతులు మొదలైన వాటిని ఆమోదించడం తదితర అంశాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పర్యవేక్షిస్తున్నాయి. ఇవి రెండూ ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఉంది. ఈ మూడింటిని కూడా కొత్త శాఖ కిందకు చేర్చే అవకాశం ఉందని, వైద్య పరికరాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పర్చిన పక్షంలో దాన్ని కూడా ఇందులోకే తేవొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఔషధాలపై యాప్..: ఔషధాల ధరలు, లభ్యత తదితర అంశాల గురించి సమాచారం అందించడానికి, అలాగే కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అనంత్ కుమార్ వివరించారు. ఔషధ కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘ఫార్మా జన సమాధాన్’ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.