'సుష్మా దేశ సంపద'
న్యూఢిల్లీ: లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ నేతలను బీజేపీ మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి వెనకేసుకొచ్చారు. సుష్మా స్వరాజ్ దేశానికే సంపదలాంటివారన్న ఆయన.. వసుంధరరాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లను అద్భుతమైన పెర్మార్మర్లుగా అభివర్ణించారు.
వరుస ఆందోళనలతో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్ష కాంగ్రెస్ పార్టీ తీరు గర్హనీయమన్న వెంకయ్య.. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ సాధించలేని విజయాలను మోదీ సర్కార్ ఏడాదిలో సాధించి చూపిందని, బీజేపీ విజయాలతో కాంగ్రెస్ పార్టీకి దడ పుడుతున్నదని, అందుకే తమను అడ్డుకుటుంటున్నారని మండిపడ్డారు.
బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన సభలోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. సరైన అంశంపై కాలపరిమితిలేని చర్చకు సిద్ధంగా ఉన్నాం. కానీ అహేతుక చర్చలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం' అని వెంకయ్య చెప్పారు.