
అఖిలపక్ష భేటీలో రాజ్ నాత్ సింగ్ తో మోదీ
న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అయితే ఈ బాధ్యతను అన్ని పార్టీలు పంచుకోవాల్సిన అవరసముందని అభిప్రాయపడ్డారు.
భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు సోమవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు వీటిని ఉపయోగించుకోవాలన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి.