పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం... పాలకులకు విన్నవిం చాం... కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నాం... అయినా..
సీతంపేట: పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం... పాలకులకు విన్నవిం చాం... కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నాం... అయినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వాపోయేవారిని వందల మందిని నిత్యం చూస్తుంటాం. అయితే.. ఇలాంటి సినిమా కష్టాలతో ఇక పని ఉండదు. ఆ పరిస్థితి నుంచి బయటపడే సరికొత్త పోకడలు అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ను వినియోగించుకుని సమస్యలపై అర్జీలను అందజేయవచ్చు. ఆన్‌లైన్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు పాలకులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర దేశ ప్రజాప్రతినిధులను మొదలుకొని, రాష్ర్టపతి వరకు ఫిర్యాదు చేయొచ్చు. అదెలాగో చూద్దాం.
రాష్ట్రపతికి వినతిపత్రం ఇలా...
రాష్ట్రపతికి వినతిపత్రం పంపించాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్యూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.ఎన్‌ఐసీ.ఇన్. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. కుడివైపున హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రేటేరియేట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే లోడేజ్ ఎ రిక్వస్ట్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షిన్ బాక్సులో సమస్యను టైప్‌చేసి పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దీన్ని గుర్తించుకుంటే మన సమస్య ఎంతవరకు పరిష్కారమైందో తరువాత తెలుసుకోవచ్చు.
ూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలంటే.. ఏపీరాజ్‌భవన్ ఎట్‌ద రేట్ ఆఫ్ జిమెయిల్.కామ్‌కు మెయిల్ చేయాలి.
ూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీవోవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. పేజీ ఓపెన్ కాగేనే ఎడమవైపు దిగువభాగంలో సిటిజన్ ఇంటర్‌ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీ నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు.