1 న తిరుమలకు రాష్ట్రపతి
తిరుమల: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబర్ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం తిరుమల చేరుకుంటారు. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అదేవిధంగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారి తిరుమలకు రానున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.