
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం భేటీ అయ్యారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో.. రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు ఆయన.
ఈ ఇద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖులే కావడం గమనార్హం. సమకాలీన రాజకీయాలపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు ఏపీ రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. భేటీ అనంతరం తిరిగి ఆయన ఏపీకి వచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment