
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌తో నాలుగు రోజుల క్రితం ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. గత రెండు రోజులతో పోలిస్తే శనివారం ఆయన ఆరోగ్యం బాగా మెరుగుపడినట్లు పేర్కొన్నాయి.
శాచ్యురేషన్ లెవల్స్ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇన్‌ఫెక్షన్ రేటు కూడా భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, నాలుగైదు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.