రక్తాక్షరాలతో హోంగార్డ్ రాసిన లేఖ
సాక్షి, కర్ణాటక: ప్రస్తుతం భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధమని పేర్కొంటూ హోంగార్డ్ లక్ష్మణ్ మడివాళ రాష్ట్రపతికి రక్తంతో కూడిన లేఖను రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాయచూరు జిల్లా మస్కి ప్రాంతంలో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ మడివాళ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్ వంటి విషయాలను బోధించడంతో పాటు గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి వివరించే లక్ష్యం ఏర్పరచుకున్నాడు. శనివారం వైద్యుల సలహాతో భారత్–చైనాల మధ్య యుద్ధం వస్తే దేశ రక్షణే కర్తవ్యంగా భావించానని, తనకు యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మూడు పేజీలతో లేఖను రాశారు. చదవండి: వంట మాస్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు పెళ్లి బృందం
Comments
Please login to add a commentAdd a comment