
‘రాష్ట్రపతి రేసులో నేను లేను’
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు బలంగా తెరపైకి రావడంతో..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు బలంగా తెరపైకి రావడంతో ఈ కథనాలపై ఆమె స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను అధికార పార్టీ అభ్యర్థిగా నిలబడనున్నట్టు వచ్చిన కథనాలు వదంతులు మాత్రమేనని ఆమె తోసిపుచ్చారు.
వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ ఇటు అధికార బీజేపీ కానీ, అటు ప్రతిపక్షాలు కానీ తమ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల రేసులో పలువురి పేర్లు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. అందులో సుష్మా పేరు కూడా ఉందని, బీజేపీ, ఆరెస్సెస్ సన్నిహిత వర్గాల ప్రకారం సుష్మ పేరు దాదాపు ఖరారైనట్లుగా జాతీయ మీడియా కథనాలు గుప్పించింది.
‘అవి రూమర్స్ మాత్రమే. నేను ప్రస్తుతం విదేశాంగమంత్రిని. (రాష్ట్రపతి అభ్యర్థిపై) మీరు అడుగుతున్న ప్రశ్న అంతర్గత వ్యవహారం’ అని సుష్మా శనివారం విలేకరులతో అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మీరు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు.