సాక్షి, చిత్తూరు: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తిరుచనురు పద్మావతి అమ్మవారిని కోవింద్ దర్శించుకోనున్నారు. అనంతరం రాత్రి బస నిమిత్తం పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శన కార్యక్రమంలో పాల్గొన్ని.. మధ్యాహ్నాం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్లనున్నారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్పీలు, 22 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 300 మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, 400 మంది పీసీలు, స్పెషల్ పోలీసులు 200 మంది, మూడు కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి 470 మంది, మొత్తం 1,692 మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment